ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధించగా బాలీవుడ్ సినిమాలు మాత్రం కలెక్షన్లు లేక ఢీలా పడ్డాయి. బాలీవుడ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలను మిగిల్చి నిర్మాతలను నిలువునా ముంచేశాయి. ఒకటీ రెండు సినిమాలు సక్సెస్ సాధించినా సౌత్ సినిమాల కలెక్షన్లతో పోల్చి చూస్తే ఆ సినిమాల విజయాలు గొప్ప విజయాలు అయితే కాదు. అయితే రోహిత్ శెట్టి బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్ గురించి స్పందించిన తీరు సౌత్ ప్రేక్షకులకు కోపం తెప్పిస్తోంది.
రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలోని సీన్లలో చాలా సీన్లు సౌత్ సినిమాలను పోలి ఉంటాయి. సౌత్ సినిమాలను కాపీ కొట్టి ఈ దర్శకుడు సినిమాలు తీస్తాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా ఎంతోమంది లెజెండ్స్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారని రోహిత్ శెట్టి అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని బాలీవుడ్ సినిమాలు ఆడనంత మాత్రాన సౌత్ సినిమాలు గెలిచినట్టు కాదని ఆయన కామెంట్లు చేశారు.
సౌత్ సినిమాలపై ఏ స్థాయిలో అక్కసు ఉందో రోహిత్ శెట్టి చెప్పకనే చెప్పేశారు. అయితే రోహిత్ శెట్టి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. సౌత్ సినిమాలు ముంబైలో ఆడుతున్నాయంటే ఆడియన్స్ వైపు నుంచి తప్పు లేదని మేకర్స్ వైపు నుంచి తప్పు ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సౌత్ సినిమాలను నెగిటివ్ చేసినంత మాత్రాన బాలీవుడ్ ఇండస్ట్రీకి కలిగే బెనిఫిట్ ఏమీ ఉండదు.
ఈ విషయాలను గుర్తుంచుకుని రోహిత్ శెట్టి వ్యవహరిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. హిందీ దర్శకనిర్మాతలు, హీరోలు మారకపోతే రాబోయే రోజుల్లో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.