Bigg Boss Telugu 6: అడవిలో ఆట టాస్క్ లో గెలిచింది ఎవరు ? బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో అడవిలో ఆట అనే టాస్క్ ఊహించని మలుపులు తిరుగుతోంది. పోలీస్ టీమ్ కి ఒక గోల్డెన్ ఎగ్ అనూహ్యంగా లభించింది. దీంతో పోలీస్ టీమ్ సేఫ్ గా ఉంది. అంతేకాదు, వాళ్లు ఇంటిని సోధా చేసినపుడు కూడా కొన్ని బొమ్మలని పట్టుకున్నారు. అడవిలో దొంగతనం చేసిన బొమ్మలని దొంగలందరూ కలిసి వ్యాపారి అయిన గీతురాయల్ కి అమ్ముతున్నారు. దీంతో గీతు రాయల్ కూడా కెప్టెన్సీ రేస్ లో ముందుంది.

మొత్తం 25 బొమ్మలు, 15వేల రూపాయల నగదుని చూపించి కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపిక అయినట్లుగా సమాచారం. ఇక గోల్డెన్ ఎగ్ లభించడంతో ఈ టాస్క్ లో పోలీసులు గెలుపొందారు. పోలీసులు గెలిచిన టాస్క్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ముగ్గుర్ని ఎంచుకోమని బిగ్బాస్ చెప్పాడు. దీంతో అందరూ ఆదిరెడ్డి, చంటి ఇంకా శ్రీసత్యలని ఎంచుకున్నారు. ఈ టాస్క్ లో ఊహించని మలుపులు చాలానే ఉన్నాయి. టాస్క్ లో ఇనయకి ఆరోహికి, అలాగే కీర్తికి పెద్ద గొడవే అయ్యింది.

తర్వాత సూర్య జైల్లో నుంచీ తప్పించుకుని వచ్చి దొంగల ముఠా నాయకుడిగా గీతుతో బేరాలు ఆడాడు. కానీ, దొంగల్లో యూనిటీ లేకపోవడం వల్ల దొంగల టీమ్ ఓడిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మూడురోజల తర్వాత టాస్క్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. గోల్డెన్ ఎగ్ పోలీసుల చేతికి చిక్కడంతో ఆటలో మజా వచ్చింది. దీంతో పోలీసులు ఆ టాస్క్ లో విన్ అయ్యారు. కెప్టెన్సీ పోటీదారులుగా ఆదిరెడ్డి, చంటి, గీతురాయల్ ఇంకా శ్రీసత్య నలుగురు పోటీ పడబోతున్నారు.

మరి ఈ నలుగురులో ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే మాత్రం ఆదిరెడ్డి – చంటి ఇద్దరికీ అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఒకవేళ హౌస్ మేట్స్ సపోర్ట్ తో అయితే మాత్రం ఈసారి ఆదిరెడ్డి – శ్రీసత్య ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే ఆదిరెడ్డికి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus