Balakrishna, Allu Arjun: నందమూరి – అల్లు కొత్త దారులు వేస్తుందా?

సినిమాల్లో కాంబినేషన్లు ఎంత ముఖ్యమో… సినిమా ఇండస్ట్రీలోనూ కాంబినేషన్లూ అంతే ముఖ్యం. రెండింటికీ తేడా ఏంటి? అనుకుంటున్నారా? చూడటానికి రెండు విషయాలు ఒకేలా ఉంటాయి కానీ… చాలా తేడా ఉంది. తొలి కాంబినేషన్‌ కొత్త కథలు రావడానికి, బ్లాక్‌బస్టర్‌లు కొట్టడానికి, కోట్లు వసూలు చేయడానికి. రెండోది టాలీవుడ్‌కే కాదు… ఏ ఇండస్ట్రీకైనా ఇబ్బందిగా మారిన ఫ్యాన్స్‌ వార్‌ను ఆపడానికి. ఇప్పుడు అర్థమైందా… మేమంతా అంతా ఒకటే… అంటూ మన హీరోలు చాలాసార్లు,

చాలా స్టేజీల మీద, చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే హీరోలు స్టైల్‌, లుక్‌, డ్రెస్సింగ్‌ ఫాలో అయ్యే అభిమానులు… ఈ మాట మాత్రం ఫాలో అవ్వరు. ఎప్పుడు చూసినా సోషల్‌ మీడియాలో ఒకరినొకరు ట్రోల్‌ చేసుకుంటూనే ఉంటారు. ఇలాంటివి ఆగాలంటే… కచ్చితంగా ఇద్దరు అగ్ర హీరోలు.. లేదంటే రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన కథానాయకులు ఒకే స్టేజీ మీద, ఒకే ఫ్రేమ్‌లో కనిపించాలి. గతంలో కొన్ని సందర్భాల్లో ఇది జరిగింది. ఇప్పుడు ‘అఖండ’ సినిమా కోసం జరగబోతోంది.

‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం అల్లు అర్జున్‌ వస్తున్నాడు. బాలకృష్ణ, అల్లు అర్జున్‌ ఒకే స్టేజీ పంచుకోబోతున్నారు. ఇది టాలీవుడ్‌కు శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇలాంటివి మరికొన్ని జరగాల్సిన అవసరం చాలానే ఉంది. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రచారం కోసం మహేష్‌బాబు – చిరంజీవి ఒకే స్టేజీ పంచుకున్న విషయం తెలిసిందే.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus