అంతా నార్మల్ అవుతుంది అనుకున్న టైములో కరోనా మరో మారు విజృంభిస్తుంది. గత 5 రోజుల నుండీ కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అసలు నెంబర్ పైకి చెప్పకపోయినా తెలంగాణలో కరోనా ఉదృతి ఇంకా తగ్గలేదు అనేది నిపుణుల మాట.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు చేపట్టకపోయినా… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మరో రెండు వారాల పాటు నైట్ కర్ఫ్యూని పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగష్ట్ ప్రారంభం నుండీ కాస్త మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణాలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయి.ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల ప్రదర్శనకు అనుమతి లభిస్తే ‘టక్ జగదీష్’ ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.కానీ ఇప్పుడు వీటి ప్లాన్ మళ్ళీ మారబోతుంది.ఆగస్టు 3, 4వ వారం ఈ చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆగస్టు 15 నాటికి పరిస్థితి నార్మల్ అయితే ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూని ఎత్తేస్తుంది. లేదంటే మళ్ళీ కష్టమనే చెప్పాలి.
‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ వంటి చిన్న చిత్రాలకు థియేటర్లు ఓపెన్ అవ్వడం కొంతవరకు కలిసొచ్చింది.కానీ వీటి కలెక్షన్లను చూస్తే జనాలు థియేటర్ కు రావడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించడం లేదని స్పష్టమవుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ ల పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుందో..!
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!