సినిమా ప్రారంభించినప్పుడే బౌండెడ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతారు. మొత్తం సినిమా నిడివి ఎంత అనేది ఓ లెక్క కూడా వచ్చేసే ఉంటుంది. అయితే పెద్ద పెద్ద సినిమాల విషయంలో చిన్న తేడా ఉంటుంది. ఓ రెండు గంటల పది నిమిషాలు అంటే… కొన్ని అదనపు సన్నివేశాలు కలిపి నిడివి మరో పది నిమిషాలు పెరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మారిపోయింది. ఒక సినిమా ఏకంగా రెండు సినిమాలుగా మారిపోతోంది. రూపాయికి ఎక్కువ… రెండు రూపాయలకు తక్కువ! ఇలాంటి సామెత ఎక్కడా వినలేదు కదా. ఇలాంటి విచిత్ర పరిస్థితే టాలీవుడ్‌లో కొన్ని సినిమాల విషయంలో నెలకొంది.
అదే ఒక సినిమాకు ఎక్కువ, రెండు సినిమాలకు తక్కువ. అంటే కథ అంతా అనుకొని, తెరకెక్కించేసరికి నిడివి అమాంతం పెరిగిపోతోంది. అంటే రూపాయి కాస్త రూపాయి కంటే ఎక్కువ అవుతోంది. దీంతో సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని, రెండు పార్టులు విడుదల చేస్తామని నిర్మాతలు అనౌన్స్ చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి మొదలైంది. ఒక్క ‘బాహుబలి’గా మొదలైన సినిమా ‘.. : బిగినింగ్’, ‘..:కంక్లూషన్’ అంటూ రెండయ్యాయి.
నిజానికి రెండో పార్టులో అంతగా చెప్పడానికేం లేక కొన్ని అదనపు సన్నివేశాలు రాసుకున్నారని టాక్. ఇప్పుడు ‘పుష్ప’ విషయంలోనూ ఇంతే. ఒక సినిమాకు ఎక్కు, రెండు సినిమాలకు తక్కువ అనేలా ఉందట. దీంతో అదనపు సన్నివేశాల సృష్టి మొదలైందట. ఈ రెండూ కాకుండా టాలీవుడ్‌లో రెండు పార్టుల మాట వినిపిస్తోంది మరో రెండు సినిమాల నుండి. అందులో ఒకటి కళ్యాణ్‌రామ్ ‘బింబిసార’. ఈ సినిమాను కూడా రెండు పార్టుల్లో విడుదల చేస్తారట. ప్రభాస్ ‘సలార్’ విషయంలోనూ దర్శకనిర్మాతలు ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారని టాక్. మరి ఏమవుతుందో చూడాలి.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!