Atlee , Allu Arjun: అట్లీ – బన్నీ.. కథ పాతదే ఫిక్స్‌.. కొత్తగా ఎలా చూపిస్తారో మరి!

అట్లీ (Atlee Kumar) సినిమాలకు విజయం ఎలా పక్కానో.. ఆయన సినిమాల కథల్లో పాత వాసన కూడా అంతే పక్కా. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లో పాత సినిమా కథల రీమోడలింగ్‌, రిఫరెన్స్‌, సీన్స్‌ కనిపిస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌తో (Allu Arjun) చేస్తారు అంటున్న సినిమా పరిస్థితి కూడా ఇంతే అని అంటున్నాయి సన్నిహిత వర్గాలు. అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌లో ‘#AAA’ అంటూ ఏప్రిల్‌ 8న ఓ సినిమా అనౌన్స్‌ అవుతుంది అని సమాచారం.

Atlee , Allu Arjun:

ఆ తేదీ ప్రత్యేకత మీకు తెలిసే ఉంటుంది. ఇక ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాగే కథ విషయం కూడా మీరు తెలిసేసుకొండి. ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా వరుస చర్చలు జరుపుతున్న అల్లు అర్జున్‌ – అట్లీ ఓ పునర్జన్మ కాన్సెప్ట్‌ను ఓకే చేశారు అని సమాచారం. అంటే బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అని సమాచారం. అలాగే యాక్షన్‌ హీరోగా కనిపిస్తాడు అని కూడా చెప్పొచ్చు.

సన్‌ పిక్చర్స్‌, గీతా ఆర్ట్స్‌ కాంబినేషన్‌లో రూపొందుతుంది అని చెబుతున్న ఈ సినిమాకు సంబంధించి బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 8న అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పునర్జన్మ కాన్సెప్ట్‌తో ముడిపడి ఉన్న భారీ పీరియాడిక్‌ డ్రామాగా కథ లైన్‌ను సిద్ధం చేశారు అని అంటున్నారు. ప్రకటన వచ్చాక పూర్తి కథను సిద్ధం చేస్తారు అని చెబుతున్నారు.

అల్లు అర్జున్‌ సినిమాలో రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనుండగా.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా భారీ స్థాయిలో ఉంటాయి అని అంటున్నారు. ఈ సినిమా కోసమే పీరియాడిక్‌ సినిమాగా తెరకెక్కిద్దామనుకున్న త్రివిక్రమ్‌ (Trivikram) సినిమాను పురాణాల నేపథ్యంలోకి తీసుకెళ్లారు అని చెబుతున్నారు. ఇక అట్లీ సినిమా విషయానికొస్తే.. జులై లేదా ఆగస్టులో సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశముందట. ఈ లోపు కాస్టింగ్‌ ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారట.

నితిన్ రీసెంట్ సినిమాల బిజినెస్.. టాప్ లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus