Kushi Movie: సమంత రావడం లేట్‌.. అందుకే తీసుకున్నారా?

విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఏమన్నా మార్పులు చేస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. కథలో మార్పుల వల్ల కొత్త హీరోయిన్‌ సినిమాలోకి వచ్చిందా.. లేక ముందు నుండి ఇదే అనుకున్నారా? అనేది తెలియదు కానీ ‘ఖుషి’ మరో భామకు చోటు కల్పిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే విజయ్‌తో కృతి శెట్టి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుందట.

విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ‘మయోసైటిస్’ రుగ్మత బారినపడటంతో సమంత ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటోంది. విదేశాలకు వెళ్లి వైద్యం తీసుకుంటోందని ఆ మధ్య వార్తలొచ్చినా.. అవన్నీ రూమర్లే అని టీమ్‌ కొట్టిపారేసింది. ప్రస్తుతం సమంత హైదరాబాద్‌లోనే ఉందట. ‘హిట్ 2’ విజయం తర్వాత అడివి శేష్‌కి అభినందనలు కూడా తెలిపింది సామ్‌. అయితే ఆమె సినిమా సెట్‌లోకి రావడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుందని టాక్‌.

ఈ వార్తతో విజయ్‌ అభిమానులు కాస్త ఢీలా పడ్డారు. ‘లైగర్‌’ పరాజయంతో ఇబ్బందుల్లో ఉన్న విజయ్ అండ్‌ అతని ఫ్యాన్స్‌.. వెంటనే ‘ఖుషి’ వచ్చేయాలని అనుకుంటున్నారు. కానీ సమంత అందుబాటులో లేకపోవడంతో సినిమా షూట్‌ ఆపేశారు. అయితే త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అంటున్నారు. అందులో విజయ్‌, కృతి శెట్టి మీద సీన్స్‌ తీస్తారు అని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు అని ఎప్పుడూ టీమ్‌ చెప్పలేదు.

అలాంటిది ఇప్పటికిప్పుడు ఇంకో నాయిక అవసరం ఎందుకు పడింది అనేది తెలియడం లేదు. సమంత అందుబాటులో లేదు కాబట్టి.. టీవీ సీరియల్‌ తరహాలో ఇంకో నాయిక పాత్రను సృష్టించి సినిమాను పూర్తి చేస్తున్నారా అనే డౌట్ ఉంది. అయితే సినిమా సన్నిహిత వర్గాలు మాత్రం ఇద్దరు నాయికలు ఉన్నారు అనే మాట అంటోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. అయితే సినిమాలో ఆమె పాత్ర తొలుత నెగటివ్ షేడ్‌లో ఉండి.. క్లైమాక్స్‌లో పాజిటివ్‌గా ముగియబోతున్నట్లు తెలుస్తోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus