DJ Tillu: డిజే టిల్లు సీక్వెల్ లో కొత్త హీరోయిన్.. అతిథిగా నేహా శెట్టి?

విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం డిజే టిల్లు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది. ఇకపోతే ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నలు అడగడంతో మేకర్స్ ఈ విషయంపై స్పందించి ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ అంతకుమించి అనేలా ఉండబోతుందని,ఈ సినిమాలో డీజెట్టిల్లు పాత్ర ద్వారా మరొక అద్భుతం క్రియేట్ చేయాలని దర్శకుడు భావించడంతో అందుకు అనుగుణంగానే కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించిన నేహా శెట్టి పాత్ర కూడా కీలకంగా మారింది.

ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో హీరో హీరోయిన్ల పాత్ర ఎంతో కీలకంగా ఉండడంతో హీరోయిన్ నేహా శెట్టి పాత్రలో మరొక కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సీక్వెల్ చిత్రంలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉండబోతుందని అందుకు గ్లామరస్ హీరోయిన్ కావాలనే ఆలోచనలో ఉన్న దర్శకుడు హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక డీజే టిల్లు సినిమాలో ఉన్నటువంటి కొంతమంది ఆర్టిస్టులు కూడా సీక్వెల్ చిత్రంలో ఉంటారని మరి కొంత మంది కొత్త వాళ్లను కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించిన నేహా శెట్టి కేవలం అతిథి పాత్రలో నటించనుంది.ఇక ఈ సినిమాకి సంబంధించిన ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభిస్తారని సమాచారం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus