“రుద్ర వీణ” అంటే రౌద్రం తో కూడిన వ్యవహారం (అగ్రెసివ్ నెస్) అని అర్థం. “రుద్రవీణ” అనగానే ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి సినిమా గుర్తుకు వస్తుంది. బాలచందర్ దర్శకత్వంలో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “రుద్రవీణ” ఎంతో క్రేజ్ తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే…అలాంటి టైటిల్ తో ఇప్పటి వరకు ఏ హీరో కూడా సినిమా తీసి మెప్పించిన దాఖలాలు లేవు.
అయితే తాజాగా ఇప్పుడు అదే టైటిల్ తో ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ రాయగురు హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి “రుద్రవీణ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
అప్పటి తరం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి మరి.అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రిలుక్ పోస్టర్ పై ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అటు సినిమా లవర్స్ కూడా ఆప్పటి తరం “రుద్రవీణ” ను ,ఇప్పటి తరం “రుద్రవీణ” ను కంపారిజ్ చేసి చూసే అవకాశం ఉంది.
అయితే పాత సినిమా టైటిల్ కు ఏ మాత్రం మచ్చ రానీవకుండా దానికి తగ్గట్టే ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమాను కూడా ప్రేక్షకులను ఆదరించి అలరించేలా అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను రూపొందించా మని దర్శక, నిర్మాతలు చెపుతున్నారు..ఆ సినిమా లాగే ఈ సినిమా టైటిల్ కూడా ప్రజల్లోకి ఈజీగా వెళ్లే అవకాశం ఉన్నందున త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ రుద్రవీణ ఈ మాత్రం ఏంటర్టైన్ చేస్తుందో చూడాలి మరి.