బిగ్‌బాస్‌ 4: వీరికి ఈ పేర్లు పెట్టిందెవరో?

‘లేదు కాదు.. రాదు వద్దు… ఎలిమినేషన్‌ మాకొద్దు… మమ్మల్ని సల్లగుండనీ…’ అంటూ నోయల్‌ బిగ్‌బాస్‌ని కాకా పట్టాలని చూశాడు. అయితే బిగ్‌బాస్‌ సీతయ్య కదా. ఎవరి మాటా వినకుండా తన పని తాను చేసుకుంటాడు. ఇదే మాట నాగార్జున కూడా చెప్పాడు. ఈ రోజు ఎలిమినేషన్‌ టైమ్‌ దగ్గర పడేసరికి నోయల్‌ ర్యాప్‌ పాడి… ఆపుదామనుకున్నాడు. కానీ అక్కడ అది కుదరదు కదా… ఎలిమినేషన్‌ అయిపోయింది.

ఎలిమినేట్‌ అయినవారితో స్టేజీ మద మనసులోని భావాలను చెప్పించడం బిగ్‌బాస్‌కు అలవాటు. ఈసారి కూడా అదే జరిగింది. స్టేజీ మీద బోర్డులో కొన్ని జంతువుల బొమ్మలు పెట్టి… వాటికి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరు సెట్‌ అవుతారు అని నాగ్‌ అడిగాడు. ఆ ఎలిమినేట్‌ అయిన వ్యక్తి ఎవరో తెలియదు కానీ… మెహబూబ్‌ను గద్దతోను, దేవిని మొసలితోను పోల్చాడు. కళ్యాణిని కోతితో పోలిస్తే, లాస్యను గాడిదతో పోల్చారు. ఇక నోయల్‌ను నక్క అన్నాడు. అఖిల్‌ను ఎద్దు ఫొటో కింద పెట్టాడు ఆ ఎలిమినేట్‌ అయిన వ్యక్తి. అయితే సింహం, పాము లాంటి జంతువులకు ఎవరి సరిపోతారని అనుకున్నారో తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఇదంతా పక్కనపెడితే ముందుగా మేం చెప్పినట్లు… ఈ రోజు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతోంది. ఇంట్లో వాళ్లకు, ఇంటిని చూస్తున్నవాళ్లకు షాక్‌ ఇస్తూ బిగ్‌బాస్‌ వైల్డ్‌ కార్డును మొదటి వారంలోనే రంగంలోకి దించాడు. అయితే అదెవరు అనేది సస్పెన్స్‌. అయితే మనకున్న సమాచారం మేరకు అవినాష్‌ లేదా సాయి పంపన అవ్వొచ్చు. ప్రోమోలో చూపించిన దానిబట్టి అయితే వచ్చిది సాయి అని తెలుస్తోంది. చూద్దాం దీనికీ సమాధానం ఈ రోజు రాత్రి 11 గంటల సమయంలో తెలుస్తుంది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus