స్మార్టుఫోన్లు.. సోషల్ మీడియా విస్తరించిన తర్వాత తెలుగును రాయడం కూడా మరిచిపోతున్నారు నేటి యువత. అలాగని ఇంగ్లిష్ లో టైప్ చేస్తున్నారంటే అదీ లేదు. రెండింటినీ కలిపి కొడుతున్నారు. ఈ ట్రెండ్ ని ఫిలిం మేకర్స్ కూడా ఫాలో అవుతున్నారు. తమ సినిమాకి అటు ఇటు కానీ భాషలో టైటిల్స్ పెడుతున్నారు. రీసెంట్ గా హిట్ అయిన “అర్జున్ రెడ్డి” తెలుగు పేరు అయినప్పటికీ పోస్టర్ పై ఇంగ్లిష్ లోనే ఉంటుంది. ఆ టైటిల్ యూత్ ని ఆకర్షించింది. ఆప్ కూడా విడుదల చేశారు. గతంలో సూపర్, బిజినెస్‌మెన్, హర్ట్‌ఎటాక్, టెంపర్, లోఫర్, రోగ్ అంటూ పూరి జగన్నాథ్ తన సినిమాలకు ఇంగ్లిష్ పేరు పెట్టి తెలుగులో రాసి కొంతమేర మేలు చేశారు.
ఆ తర్వాత వచ్చిన మిస్టర్, విన్నర్, డిక్టేటర్, లయన్, జెంటిల్‌మెన్, స్పైడర్ తో కూడా వచ్చే నష్టమేమీ లేదు. అల్లు అర్జున్ నటించిన ‘(దువ్వాడ జగన్నాథమ్)’కి డీజే అని.. నాని నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ను McA అని ఆంగ్లంలోనే రాసి “మిడిల్ క్లాస్ అబ్బాయి” అని , కల్యాణ్‌రామ్ నటిస్తున్న కూడా MLA అని రాసి “మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి” అని తెలుగులో కొత్త అర్ధాలు చెబుతున్నారు. “రాజా ది గ్రేట్”, ఆది “నెక్ట్స్ నువ్వే” “మెంటన్ మదిలో”… ఇలా చాలా సినిమాల టైటిళ్లు ఆంగ్లం, తెలుగు కలిపేసి కుమ్మేస్తున్నారు. ఇదొక క్రియేటివిటీ అని ప్రసంశించాలో.. తెలుగును కూనీ చేస్తున్నారని విమర్శించాలో ఎవరికీ అర్ధం కావడం లేదు.