Akhil: అఖిల్‌ సినిమా విషయంలో నాగ్‌ మాట చెల్లుతుందా?

సినిమా విడుదలయ్యాక ఏ రెండు వారాలకో, మూడు వారాలకో ఓటీటీకి వచ్చేది. దాని వల్ల తక్కువ మంది దాని కోసం వెయిట్‌ చేసేవారు. అయితే కరోనా, లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఇప్పుడు రూట్‌ మారిపోయింది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా ఆలస్యమవ్వడం పాపం… డైరెక్ట్‌ ఓటీటీనా అని అడుగుతున్నారు. లేదంటే సినిమా ఫలితం మీద ఇండస్ట్రీలో సరైన ఫీడ్‌బ్యాక్‌ లేకపోయినా ‘ఏంటీ ఓటీటీనా’ అని అడుగుతున్నారట. మరోవైపు సినిమా అంతా సిద్ధమై… విడుదలకు ఏదో అడ్డంకి వచ్చినా ఇదే మాట అంటున్నారు.

తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’ ఒకటి. అఖిల్‌ – పూజా హెగ్డే నటించిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే సిద్ధమైపోయింది. విడుదల చేసేద్దాం అనుకునేలోపు కరోనా తొలివేవ్‌ వచ్చింది. పరిస్థితి కుదుటపడ్డాక చేద్దాం అని అన్ని ప్లాన్‌ చేసి, డేట్‌ ఇచ్చారు. మళ్లీ కరోనా – లాక్‌డౌన్‌. దీంతో ఈ సినిమా ఓటీటీకి ఇచ్చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో నాగార్జున ఏమంత హ్యాపీగా లేరని వార్తలొచ్చాయి. అయితే ఇదే విషయంలో అల్లు అరవింద్‌ కూడా హ్యాపీగా లేరట.

సినిమా అంతా సిద్ధమై… ఇంకెన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటామనే ఆలోచనలో ఉన్నారట అల్లు అరవింద్‌. దాంతోపాటు సినిమా టాక్‌ విషయంలో అంత నమ్మకంగా లేరనే వార్తలూ వస్తున్నాయి. అందుకే రీషూట్లు గట్రా చేశారట. దీంతో ఓటీటీకి తలుపు తెరిచారని తెలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి వాటితో సంప్రదింపులు జరిపే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఇవన్నీ కాకపోతే ‘ఆహా’ ఎలాగూ ఉందిగా. సొంత సినిమా సొంత ఓటీటీలో విడుదల చేసుకుంటారేమో.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus