Buchi Babu: అక్కడ ఎదురైన సమస్యే ఇక్కడా ఎదురవుతోందా.. ఆ తప్పు చేయొద్దంటూ?

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ తో రెండో సినిమా చేయాలని భావించినా జూనియర్ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ఆ సినిమా కథతోనే చరణ్ ను సంప్రదించగా చరణ్ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు. చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీ ఆగిపోవడంతో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ వేగంగానే మొదలవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం బుచ్చిబాబు కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబుకు ఎదురుచూపులు తప్పడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఎదురైన సమస్యే ఇక్కడ కూడా ఎదురవుతోంది. అయితే బుచ్చిబాబు చరణ్ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ ను లాక్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఈ విధంగా చేయడం వల్ల వేగంగా సినిమాలు చేయడంతో పాటు కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. బుచ్చిబాబు రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. మరీ భారీ స్థాయిలో బుచ్చిబాబు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది. సుకుమార్ శిష్యులలో దాదాపుగా అందరూ డైరెక్టర్లుగా సక్సెస్ సాధించడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాకు (Buchi Babu) బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది. బుచ్చిబాబు రాబోయే రోజుల్లో దర్శకునిగా తన రేంజ్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. బుచ్చిబాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయారు. బుచ్చిబాబు మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus