RRR, Radhe Shyam: మళ్ళీ ఫ్యాన్స్ కు కొత్త ఆశలు రేపుతున్నారు…!

పరిస్థితులు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’ లు రిలీజ్ అయ్యి ఉండేవి. కానీ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడం, ఆంధ్రాలో టికెట్ రేట్ల ఇష్యు ఓ కొలిక్కి రాకపోవడంతో మళ్ళీ ఇవి వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి ఎండింగ్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని కొన్ని సర్వే లు చెబుతున్నాయి. అవి నిజమనుకుని మళ్ళీ కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసే పనిలో పడ్డాయి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’ యూనిట్లు.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయబోతున్నారట. ఆ డేట్ కు సిద్ధం కావాలని బయ్యర్స్ కు సమాచారం కూడా పంపారట నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారు. అదే డేట్ కు ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు ‘యూవీ క్రియేషన్స్’ వారు. వాళ్ళ సినిమానే కాబట్టి… దాన్ని పక్కకి జరిపి ‘రాధే శ్యామ్’ ను తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ టీం కూడా మరో రిలీజ్ డేట్ పై కన్నేసింది. ఏప్రిల్ 29న ‘ఆర్.ఆర్.ఆర్’ ను థియేటర్లలోకి దింపాలని రాజమౌళి, దానయ్య లు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 28న ‘ఎఫ్2’ విడుదల కాబోతున్నట్టు దిల్ రాజు టీం అనౌన్స్ చేసింది. ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ కు రెడీ అయితే దానిని తప్పించడానికి దిల్ రాజు సిద్దంగానే ఉంటారు. ప్రమోషన్స్ చాలా వరకు పూర్తయ్యాయి.

సమ్మర్ రిలీజ్ అంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ కు కలిసొచ్చే అంశమే..! అయితే ఇవన్నీ జరగాలి అంటే కరోనా కేసులు తగ్గి పరిస్థితి సాధారణ స్థితికి రావాలి. గత రెండేళ్ళుగా చూసుకుంటే.. మార్చి, ఏప్రిల్ సమయానికి కరోనా కేసులు భారీగా పెరిగాయి. దాంతో అప్పుడే ఓ క్లారిటీకి వచ్చేయలేము.ఆ సినిమాల నిర్మాతల మనస్సుల్లో మాత్రం మార్చి, ఏప్రిల్ లో విడుదల చేయాలనే ఆశ ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus