సినిమాలకు పెద్ద కష్టం అంటే పైరసీ, సెన్సార్ కష్టాలు అని చెప్పొచ్చు. ఎంతో మంది కష్టపడి సినిమా తీసి, రిలీజ్ చేస్తే.. టెక్నాలజీ ఉపయోగించుకుని కొందరు పైరసీ చేసేస్తారు. వాటిని జనాలు ఎందుకు చూస్తారు అనేది వేరే చర్చ. అయితే ఆ సమస్య సరైన పరిష్కారం కోసం చాలామంది, చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. మరో సమస్య.. సెన్సార్. సినిమాలకు సరైన సెన్సార్ పరిస్థితులు లేవని చర్చ నడుస్తోంది. తాజాగా ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ మేరకు మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏ సినిమా ఏయే వయసుల వారు చూడొచ్చు అని వర్గీకరించేందుకు సినిమాటోగ్రఫ్ (సవరణ) బిల్లు – 2023ని కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. త్వరలో దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సినిమాలను U, A, UA అనే మూడు విభాగాలుగా వర్గీకరించి సెన్సార్ బోర్డు అనుమతులు మంజూరు చేస్తోంది.
వైద్యులు, శాస్త్రవేత్తలు లాంటి ప్రత్యేక విభాగ వీక్షకులకు (Censor) ఉద్దేశించిన సినిమాలకు S వర్గం కింద సర్టిఫికేట్ ఇస్తున్నారు. UA చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడాలంటే… వారి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే అనేది నిబంధన. అయితే ఇకపై 12 ఏళ్ల లోపువారికి బదులు UA 7+, UA 13+, UA 16+ అనే వర్గీకరణ తీసుకురానున్నారు. ఆయా వయసుల వారు ఆ సినిమాలను చూడొచ్చని అర్థం.
ఇక పైరసీ సినిమాలను ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేయడాన్ని నిరోధించడానికి చట్టాన్ని సవరించనున్నారు. పైరసీని అడ్డుకోవడం, ఏయే వయసు వారు ఏయే సినిమాలు చూడొచ్చు అనే వర్గీకరణ.. కాలంచెల్లిన నిబంధనల్ని రద్దు చేయడంపై వివిధ వర్గాల నుండి వచ్చిన డిమాండ్లను పరిశీలించి ఈ మేరకు బిల్లు తీసుకొస్తారట. దీంతో ఓటీటీల సినిమాల సెన్సార్ గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంటుంది అని సమాచారం.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!