Pawan Kalyan: ఇటు పుకార్లు.. అటు ట్వీట్‌.. హరీశా ఏంటిది?

పవన్‌ కల్యాణ్‌ లైనప్‌ చెప్పండి చూద్దాం అంటే.. ఫ్యాన్స్‌ పెద్ద లిస్టే చెబుతారు. అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అంటే మాత్రం తెల్లమొహం వేస్తారు. ఎందుకంటే సినిమా షూటింగ్‌లు ఎప్పుడు అవుతాయో పవన్‌ కల్యాణ్‌ కూడా పక్కగా చెప్పలేకపోవడమే. రాజకీయాల్లో అడుగుపెట్టాక పవన్‌ సినిమాల్లో ఏదీ అనుకున్నది అనుకున్నట్లు షూట్‌ అవ్వడం లేదు. అలా ఆగుతూ, ఆగుతూ సాగుతున్న కెరీర్‌ వల్ల అతనితో సినిమా చేయలనుకుంటున్న కొంతమంది దర్శక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయం బయటకు చెప్పకపోయినా.. ట్వీట్లు, కామెంట్లతో తెలుస్తోంది.

పవన్‌ చర్యల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లలో హరీశ్‌ శంకర్‌ ఒకరు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ ఎప్పుడు అని అడుగుతున్నారు ఫ్యాన్స్‌. దానికి ఆయన త్వరలో త్వరలో అని చెబుతున్నా.. అందులో అంత కాన్ఫిడెన్స్‌ కనిపించడం లేదు అని చెబుతున్నారు ఫ్యాన్స్‌. ఆ సినిమా ఇప్పటికే మొదలై, విడుదల కూడా అవ్వాల్సింది. అయితే పవన్ ఇంకా డేట్స్‌ ఇవ్వలేదు. జూన్‌లో స్టార్ట్‌ అని అప్పుడన్నారు. ఆ తర్వాత జులై అన్నారు. ఇప్పుడు కొత్త డేట్‌ ఇంకా రాలేదు.

అయితే ఈ సినిమాకు సంబంధించి పవన్‌కు హరీశ్ శంకర్‌ ఫైనల్‌ నెరేషన్‌ ఇచ్చారని ఓ మాట తాజాగా వినిపిస్తోంది. పవన్‌ పుల్‌ శాటిస్‌ఫై అయ్యారని కూడా టాక్‌. దీంతో త్వరలో సినిమా ప్రారంభం అనే మాట వినిపిస్తోంది. అయితే తాజాగా హరీశ్‌ శంకర్‌ చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ‘‘బాణాన్ని విల్లులో వెనక్కి లాగి విడిచిపెడితేనే ముందుకు వెళ్తుంది. అలాగే జీవితంలో ఎన్నో అడ్డంకులు మనల్ని వెనక్కి లాగుతుంటాయి. అంటే వాటి వల్ల నువ్వు ముందుకు వెళ్లే వేగం పెరుగుతుంది అని అర్థం.

కాబట్టి లక్ష్యంపై మీద దృష్టిపెట్టు.. ముందుకు సాగు’’ అని పాలో కోలో అనే ప్రముఖ వ్యక్తిఇ చెప్పిన కోట్‌ను పోస్ట్‌ చేశారు. దీంతో ‘భవదీయుడు..’ ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. హరీశ్‌ క్యాజువల్‌గా ఆ ట్వీట్‌ చేశారా, లేక తన సినిమా వెనక్కి వెళ్లిందని చేశారా, లేక తనను వెనక్కి లాగిన వాళ్లకు నేను ముందుకెళ్తున్నా అని చెప్పడానికి చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరి దీని గురించి ఆయన్నేమన్నా ట్వీట్‌ చేస్తారేమో చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus