Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్ కు ఊహించని షాక్.. ఆ సాంగ్ ను థియేటర్లలో చూడలేమా?

మరికొన్ని రోజుల్లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 19వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ మాత్రమే విడుదలైన సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ అప్ డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో దంచవే మేనత్త కూతురా సాంగ్ ను రీమిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ ను సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ చూడలేరని దసరా పండుగ సమయంలో ఈ సాంగ్ ను సినిమాలో యాడ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించిన షూట్ పూర్తైందని తెలుస్తోంది. బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో ఒక పాటను సైతం రిలీజైన చాలా రోజుల తర్వాత యాడ్ చేయడం జరిగింది.

సాంగ్ ను ఆలస్యంగా యాడ్ చేయడం వల్ల బాలయ్య అభిమానులు రెండోసారి కూడా ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సినిమాలో సాంగ్ ఎక్కడా సెట్ కాకపోవడంతో ఈ ప్రయోగం చేస్తున్నారని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భగవంత్ కేసరి (Bhagavanth Kesari) బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

బాలయ్య తర్వాత సినిమాలపై సైతం భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. భగవంత్ కేసరి సినిమాలో 8 యాక్షన్ సీన్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus