Devara: పెద్ద సినిమాలకు ట్రోలింగ్ టెన్షన్.. ట్రోల్స్ హద్దులు దాటుతున్నాయా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్, ట్రోలింగ్ హద్దులు దాటుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేవర (Devara) సినిమా నుంచి ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు కానుకగా ఒక గ్లింప్స్, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)  పుట్టినరోజు కానుకగా ఒక గ్లింప్స్ రిలీజ్ కాగా ఆ గ్లింప్స్ లకు ఊహించని స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి దేవర ట్రైలర్ సైతం ప్రతి 100 మంది ప్రేక్షకులలో 90 మందికి నచ్చింది.

Devara

అయితే సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది కావాలనే దేవర గురించి నెగిటివ్ పోస్టులు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ను కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. దేవర రిలీజ్ రోజున సైతం అసలు టాక్ మాత్రమే స్ప్రెడ్ అయ్యేలా తారక్ అభిమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

పెద్ద సినిమాలకు ట్రైలర్లకు ట్రోల్స్ కొత్తేం కాదు. అయితే ట్రైలర్ లో కంటెంట్ మరీ చెత్తగా ఉంటే తప్ప ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఈ మధ్య కాలంలో ఒక భారీ బడ్జెట్ సినిమా ట్రైలర్ మరీ అద్భుతం అనిపించుకోకపోయినా రిలీజ్ రోజున యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది. గతంలో కూడా ట్రైలర్ నచ్చకపోయినా సినిమా మెప్పించిన సందర్భాలు ఉన్నాయి.

వాస్తవానికి ఏ సినిమా ట్రైలర్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించదు. మరోవైపు ఫ్యాన్స్ వార్ వల్ల సినిమాలకు నష్టం తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే. దేవర సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ 1.7 మిలియన్ డాలర్స్ క్రాస్ చేశాయంటే తారక్ మూవీ కోసం ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. దేవర రిలీజ్ సమయానికి మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉంది.

స్పిరిట్ గురించి వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్.. ప్రభాస్ ఆ పాత్రలో కనిపిస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus