Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన కొరటాల శివ..?

  • May 25, 2021 / 02:23 PM IST

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ లు ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఆచార్య షూటింగ్ పది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉండగా ఈ సినిమా తరువాత కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల కొరటాల శివ ఇంటికే పరిమితం కావడంతో తారక్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను కొరటాల శివ వేగంగా పూర్తి చేస్తాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయని సమాచారం. కరోనాతో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు సహాయం చేయాలనే సదుద్దేశంతో కొరటాల శివ వాళ్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రోజులో కొంత సమయం మాత్రమే తారక్ స్క్రిప్ట్ కోసం కొరటాల శివ సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ కోసం తయారు చేసిన కథతోనే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ కొరకు కొత్త కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాలేదని తెలిసి తారక్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. స్క్రిప్ట్ పనులు ఆలస్యమైతే కొరటాల శివ తారక్ సినిమా పనులు ఆలస్యమవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభాస్ లా తారక్ కూడా ఒకే సమయంలో రెండు సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ సూచనలను ఎన్టీఆర్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus