సాధారణంగా రాజమౌళి సినిమాలు అనుకున్న తేదీకి రిలీజ్ కావని ఇండస్ట్రీలో ఒక విమర్శ ఉంది. సీన్ల విషయంలో రాజీ పడని డైరెక్టర్ గా రాజమౌళికి పేరుంది. తను అనుకున్న ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు రాజమౌళి అస్సలు రాజీ పడరు. తక్కువ బడ్జెట్ తోనే క్వాలిటీతో సినిమాలను తెరకెక్కించే ఈ దర్శకుడు కథనంలో చేసే మ్యాజిక్ వల్లే సినిమాల విషయంలో సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో మళ్లీ గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాల్ వాయిదా పడ్డాయి. హిందీలో గంగూబాయి సినిమా సైతం ఆర్ఆర్ఆర్ కోసం తప్పుకుంది. అయితే పరిస్థితులు మారడంతో ఆర్ఆర్ఆర్ నిర్మాతలు తమ సినిమాను వాయిదా వేసి ఇతర సినిమాల దర్శకనిర్మాతలకు ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చారు. వరుసగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగడంతో రిలీజ్ డేట్ మారకపోవచ్చని చాలామంది భావించారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఘనంగా జరిగాయి.
ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో సమ్మర్ లో సినిమాలను షెడ్యూల్ చేసుకున్న నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రిలీజ్ డేట్ ను త్యాగం చేయడానికి ఈసారి హీరోలు, నిర్మాతలు సిద్ధపడే పరిస్థితులు లేకపోవచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీని రాధే సినిమాలా ఒకేరోజు థియేటర్లలో ఓటీటీలో విడుదల చేస్తే బాగుంటుందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఇలా రిలీజ్ చేస్తే ఆర్ఆర్ఆర్ మూవీకి కలెక్షన్ల రికార్డులు మాత్రం సాధ్యం కావని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ కాపీ సిద్ధమైనప్పుడే రాజమౌళి సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని చరణ్, తారక్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ మేకర్స్ కు రిలీజ్ డేట్ మార్చుకున్న ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల రాజమౌళి గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!