Ram, Boyapati Srinu: సరికొత్త టైటిల్ తో రామ్ – బోయపాటి ల సినిమా!

రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ ఊర మాస్ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి యూట్యూబ్ ని షేక్ చేసింది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 15 న రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ఆల్రెడీ ప్రకటించేసింది. మొదట దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ అదే టైంకి బాలయ్య – అనిల్ రావిపూడి ల ‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ అవుతుండడంతో బోయపాటి టీం ఓ నెల ముందుగానే వచ్చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. బోయపాటి – బాలయ్య ల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా. (Ram) రామ్ – బోయపాటి ల సినిమాకి టైటిల్ ఏంటి అనే ప్రశ్నలు ఇంకా అందరిలోనూ మెదులుతూనే ఉన్నాయి. ఈ విషయం పై చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం..

ఈ చిత్రానికి ‘స్కంద’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ‘స్కందుడు’ అంటారు. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. డివోషనల్ టచ్ కూడా ఉంటుంది కాబట్టి.. నార్త్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లు ఉంటాయి. ఈ వీకెండ్లోనే ‘స్కంద’ టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా వదలనున్నట్టు ఇన్సైడ్ టాక్.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus