Guntur Karam: ఆ సినిమాలతో పోటీ వల్ల గుంటూరు కారంకు కష్టమేనా?

  • October 3, 2023 / 04:35 PM IST

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద సినిమాలకు సంబంధించి థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాల్లేకుండా అన్ని సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
అయితే సలార్ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో గుంటూరు కారం సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సైంధవ్, నా సామిరంగ, ఈగిల్, హనుమాన్, విజయ్ పరశురామ్ కాంబో మూవీ, రజనీ తమిళ డబ్బింగ్ మూవీ ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి. ఈ సినిమాలతో పాటు ఇతర భాషలకు సంబంధించిన మరో మూడు నుంచి నాలుగు సినిమాలు ఈ రేసులో ఉండే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా గుంటూరు కారం సినిమాకు ఏ స్థాయిలో థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.

మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు మూడు నుంచి నాలుగేళ్లు రాజమౌళి సినిమాకే పరిమితం కానున్నారని సమాచారం అందుతోంది. గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ మొదలైతే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గుంటూరు కారం (Guntur Karam) సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. గుంటూరు కారం సినిమా సక్సెస్ సాధించడం త్రివిక్రమ్ కు కీలకమనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus