OG (OG Movie) చిత్రంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజాస్ గంభీర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర పవన్ స్టైల్‌కు పూర్తి న్యాయం చేస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ఈ చిత్రానికి అందించిన ఒక సాంగ్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది.
OG నుంచి భారీ అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్ మెల్లమెల్లగా పూర్తవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కొత్త సంవత్సరానికి స్పెషల్ గిఫ్ట్ గా జనవరి 1న OG నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ శింబు (Simbhu) పాడిన ప్రత్యేక పాట కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం మేకర్స్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను వేసవి విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ (Trivikram) స్ర్కిప్ట్ సపోర్ట్ ఉండటంతో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ఆమె పవన్ సరసన కనిపించనుండటం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ మరికొన్ని చిత్రాల షూటింగ్‌లను కూడా పూర్తి చేయాల్సి ఉంది.
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాపై కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ (Jyothi Krishna ) దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. అలాగే, హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. ఫ్యాన్స్ మాత్రం OG ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరంలో వచ్చే ఈ మ్యూజికల్ సర్‌ప్రైజ్‌తో అభిమానులకు ఎలాంటి జోష్ ని ఇస్తుందో చూడాలి.