‘ఇస్మార్ట్ బ్యూటీ’ షాకింగ్ రెమ్యూనరేషన్..!

గతేడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ చిత్రంలో ఈమె చేసిన గ్లామర్ షోకి… కుర్ర కారు మతులు పోయాయనే చెప్పాలి. అంతకు ముందు కూడా ఈ బ్యూటీ సినిమాలు చేసింది. ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలోనూ నటించింది. అయితే ఆ రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. కానీ ఈమె మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఆ క్రేజ్ ను డబుల్ చేసుకుంది. ఇప్పుడు ఈమెకు తమిళ ఇండస్ట్రీ నుండీ కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ. త్వరలోనే ఆ చిత్రం విడుదల కానుంది.

హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లో నటించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. కానీ పారితోషికం గట్టిగా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ఇటీవల ఓ నిర్మాత తన సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యమని అడుగగా.. అందుకు ఓకే చెప్పిన నిధి.. పారితోషికంగా 60 లక్షలు డిమాండ్ చేసి షాకిచ్చిందట. ఆమె డిమాండ్ అలా ఉంది అని ఇండస్ట్రీలో కూడా ఆ నిర్మాతకు చెప్పారట. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ గల్లా జయదేవ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘భలే మంచి రోజు’ ‘శమంతక మణి’ ‘దేవదాస్’ వంటి చిత్రాలను అందించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus