Nidhhi Agerwal Wedding: పెళ్లికి రెడీ అవుతున్న ఇస్మార్ట్ బ్యూటీ?

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలాగే కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమెకి గత కొంతకాలంగా చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మొదట్లో కొన్ని వరుస అపజయాలు చూసినప్పటికీ కూడా నిధి అగర్వాల్ ఇప్పుడు మాత్రం మంచి అవకాశాలు అందుకుంటూ తన రేంజ్ ను పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది.

అయితే చాలా కాలం తర్వాత ఆమెకు సంబంధించిన ఒక విషయం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గా సోషల్ మీడియాలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే కథనాలు ఎన్ని వస్తున్నా కూడా ఈ బ్యూటీ సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోబోయేది మరెవరో కాదు. కోలీవుడ్ లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరో శింబుతో నిధి అగర్వాల్ ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత కొంత కాలంగా వీరిద్దరూ కూడా సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నట్లు గా కూడా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదే ఏడాది నిధి అగర్వాల్ శింబు ఇద్దరు కూడా సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లోనే వేరే వివాహం జరగనున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇక వార్తలు ఎన్ని వస్తున్నా కూడా శింబు నిధి అగర్వాల్ ఇద్దరూ కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.

ఈశ్వర్ అనే సినిమా చేసిన ఇద్దరు కూడా ఆ సినిమా షూటింగ్ లోనే చాలా దగ్గర అయినట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలలు డేటింగ్ చేసిన అనంతరమే ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus