నేను అలా చేయకుండా ఉండాల్సింది : నిహారిక

లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హ్యాపి వెడ్డింగ్”. సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈనెల 28న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల వేగం పెంచారు. ఇందులో భాగంగా నిహారిక మాట్లాడుతూ.. తన మొదటి సినిమా విషయాలు కూడా గుర్తుచేసుకున్నారు. “తొలి అడుగులోనే కోలుకోలేని తప్పు చేశా. నాన్న అప్పటికీ చెబుతున్నారు. ఈ సినిమా ఎంచుకుని సరైన నిర్ణయమే తీసుకున్నావా? అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు.

నేనే ఈ కథపై నమ్మకంతో ఆ సినిమా ఒప్పుకున్నా. కానీ నా అంచనా తప్పింది. అయితే. ఆ సినిమా ఎందుకు చేశానా? అని బాధ పడడం లేదు. అలాంటి పాత్రలు భవిష్యత్తులలో దొరకడం కష్టమనిపించి.. ఒప్పుకున్నా” అని నిహారిక వెల్లడించింది. ఆ సినిమా నేర్పిన గుణపాఠంతో చాలా రోజులు అలోచించి “హ్యాపి వెడ్డింగ్” కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంతో గ్రాండ్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ నిహారికకు ఎటువంటి హిట్ అందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus