Niharika: ఆ ఒక్క ఫోటో మినహా అన్ని డిలీట్ చేసిన నిహారిక.. ఏమైందంటే?

మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ గత కొద్దిరోజులకు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా నిహారిక విడాకులు వార్తలు గురించి రోజుకో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగాను స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇలా నిహారిక చైతన్య విడాకుల గురించి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. జొన్నలగడ్డ వెంకట చైతన్య నిహారికల వివాహం 2021 సంవత్సరంలో జరిగింది అయితే గత కొద్ది రోజులుగా ఎక్కడ జంటగా కలిసి కనిపించలేదు అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.

ఇకపోతే వెంకట చైతన్య తన ఇంస్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు అన్నింటిని కూడా డిలీట్ చేశారు. ఇలా వెంకటచైతనే ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారని అందరూ భావించారు. ఇకపోతే తాజాగా నిహారిక సైతం పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి విడాకులు పక్కా అని చాలామంది భావిస్తున్నారు. నిహారిక తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసి కేవలం ఒకే ఒక ఫోటోని అలాగే ఉంచారు.

పెళ్లి మండపంలో వెంకటచైతన్య పక్కన నిహారిక (Niharika) ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు చైతన్య ఫేస్ కాస్త బ్లర్ అయినట్టు కనిపిస్తుంది. ఇలా ఈ ఒక్క ఫోటో మినహా మిగిలిన ఫోటోలు అన్నింటిని నిహారిక డిలీట్ చేశారు. ఇలా ఈ ఫోటోని అలాగే ఉంచిన ఈమె తన దగ్గర ఒక రహస్యం ఉందని… అది బయటికి చెబితే రహస్యం ఎలా అవుతుంది? అందుకే చెప్పడం లేదు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

నిహారిక ఈ ఒక్క ఫోటోని మాత్రమే ఉంచడంతో నేటిజన్స్ సైతం ఈ ఒక్క ఫోటో కూడా ఎందుకు ఉంచడం దీనిని డిలీట్ చేయొచ్చుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక విడాకుల విషయం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఈమె విడాకుల విషయంలో క్లారిటీ రావాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus