మెగా డాటర్ నిహారిక కొనిదెల యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదని చెప్పాలి. ఇకపోతే వివాహం అనంతరం నిహారిక సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారిపోయారు. ఇలా వెబ్ సిరీస్ లను నిర్మించడమే కాకుండా వెబ్ సిరీస్లలో నటిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి
ఇప్పటికే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఇదే నిర్మాణ సంస్థలో జీ 5 తో కలసి హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 12వ తేదీ నుంచి జీ 5 లో ప్రసారమవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో నిహారిక ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె మాట్లాడుతూ తన వెబ్ సిరీస్ 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ సొంతం చేసుకుందనీ తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కి యువత నుంచి ఎంత ప్రోత్సాహకరమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ఈ సిరీస్ ఎక్కువగా ఐటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒత్తిడి గురించి ఎంతో స్పష్టంగా తెలియజేయడంతో ఈ వెబ్ సిరీస్ యువతను ఆకట్టుకుందని తెలుస్తుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ తో ఎంతో ప్రోత్సాహాన్ని అందించడంతో డిజిటల్ రంగంలో మరెన్నో మైలురాళ్లు దాటే ప్రోత్సాహం కల్పించాలని ఈ సందర్భంగా నిహారిక తన వెబ్ సిరీస్ ఎంతో హిట్ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో ప్రసారం అవుతుంది.