Niharika, Santosh: యంగ్ హీరోతో డాన్స్ చేస్తూ చిల్ అవుతున్న నీహారిక!

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.తన వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి వార్తలు వచ్చిన ఈమె వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా తన సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే తన నిర్మాణ సంస్థలో పలు సినిమాలు వెబ్ సిరీస్లను నిర్మించడానికి నిహారిక ఆసక్తి చూపెడుతూ పలు సినిమా కథలను వినే పనిలో బిజీగా ఉన్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో సక్సెస్ సాధించడానికి నిహారిక భారీగానే కష్టపడుతున్నారు.

ఇలా ఒకవైపు వృత్తి పరమైన జీవితంలో ముందుకు సాగుతూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే నిహారిక (Niharika) తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్ తో కలిసి డాన్స్ చేస్తూ సరదాగా గడుపుతున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ గా మారింది.నిహారిక సంతోష్ శోభన్ తో కలిసి ఇలా డాన్స్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే సంతోష్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఈయన నటించిన అన్ని మంచి శకునములే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమా మే 18వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే సంతోష్ శోభన్ ఈ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొనగా నిహారిక సైతం ఈ ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు. దీంతో వీరిద్దరూ కలిసి ఈ సినిమాలోని మెరిసే మెరిసే అనే పాటకు డాన్స్ వేస్తూ చిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఇక సంతోష్ శోభన్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా మెగా డాటర్ సుస్మిత నిర్మాణంలో వచ్చినటువంటి శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో కూడా సంతోష్ హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. అయితే ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus