Niharika: పుష్ప2 లో అలాంటి పాత్రలో నటించిన నిహారిక?

మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు.యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక అనంతరం హీరోయిన్ గా నటించారు. అయితే ఈమె తన పెదనాన్న చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక గిరిజన యువతి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరమయ్యారు. కానీ ప్రస్తుతం తిరిగి సినిమాలలోకి నిహారిక రీ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. నిహారిక ఒకవైపు నిర్మాణ సంస్థను స్థాపించి వెబ్ సిరీస్ లను సినిమాలను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈమె మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారట. ఈ క్రమంలోని సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమాలో నిహారిక సందడి చేయబోతుందని సమాచారం. ఈ సినిమాలో ఒక గిరిజన యువతి పాత్రలో నిహారిక నటించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటున్నట్లు సమాచారం.గతంలో ఈ పాత్రలో సాయి పల్లవి నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం ఈ పాత్రలో నిహారిక నటించబోతున్నారని వార్తలు రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక నిహారిక మరోవైపు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా వార్తలో నిలుస్తున్నారు.

ఈమె తన భర్త వెంకట చైతన్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా నిహారిక గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను ఎవరు ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో ఇది నిజమేనని అందరూ భావిస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus