Niharika: వైరల్ అవుతున్న నిహారిక రియాక్షన్.. అసలేం జరిగిందంటే?

స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగబాబు (Naga Babu) చేసిన ట్వీట్ సంచలనం కావడం ఆ ట్వీట్ ను నాగబాబు డిలేట్ చేయడం జరిగింది. గొడవ సద్దుమణిగిందనే సమయంలో హీరో సాయితేజ్ (Sai Dharam Tej)  బన్నీని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం సంచలనం అయింది.

బన్నీని సాయితేజ్ అన్ ఫాలో చేయడం గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే బన్నీని సాయితేజ్ అన్ ఫాలో చేయడం గురించి నిహారికకు ప్రశ్నలు ఎదురు కాగా నిహారిక (Niharika) ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. ఎవరు ఎవరిని ఎందుకు అన్ ఫాలో చేస్తారో నాకు తెలియదని నిహారిక తెలిపారు. మీరడిగే ప్రశ్నకు సంబంధించి నాకేం తెలియదని నిహారిక చెప్పుకొచ్చారు.

అయితే అన్ ఫాలో చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయని నిహారిక పేర్కొన్నారు. అవేంటనేది నాకు తెలియదని ఆమె తెలిపారు. కమిటీ కుర్రోళ్లు సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిహారిక ఈ కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ మాత్రం ఈ వివాదం విషయంలో నోరు మెదపలేదు. పవన్ పై (Pawan Kalyan) అభిమానంతో సాయితేజ్ ఈ విధంగా చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో పాటు జనసేన పోటీ చేసిన ప్రతి ప్రాంతంలో గెలిచింది. జనసేన సంచలన విజయం సాధించడంతో సాయితేజ్ కాలినడకన తిరుమల వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం సమసి పోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ పుష్ప2 (Pushpa 2: The Rule)  సినిమాతో బిజీగా ఉండగా సాయితేజ్ క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. పుష్ప2 సినిమా బిజినెస్ పరంగా అదరగొడుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus