సైరాలో ఛాన్స్ కోసం చరణ్ ని బతిమిలాడుకున్న నిహారిక

బాహుబలి వంటి సినిమాల్లో చిన్న రోల్ చేసినా చాలని అనుకోని నటీనటులంటూ ఉండరు. బాహుబలి సినిమా స్థాయిలో తెలుగులో రూపుదిద్దుకుంటున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. ఇందులో నటించాలని చాలామంది అనుకుంటారు. కానీ కొంతమందికే అవకాశం దక్కుతుంది. ఈ చిత్రంలో చిన్న రోల్ అయినా చేయాలనీ మెగా డాటర్ నిహారిక కూడా అనుకుంది. అన్నయ్య రామ్ చరణ్ నిర్మాత, హీరో పెదనాన్న.. అవకాశం సులువుగానే వచ్చేస్తుందని.. అనుకోవచ్చు. కానీ సులభంగా ఛాన్స్ దక్కలేదని నిహారిక చెప్పింది. ఆల్ మోస్ట్ రామ్ చరణ్ అన్న కాళ్లు పట్టుకున్నానని వివరించింది. “ఒక మనసు” చిత్రం తర్వాత నిహారిక చేసిన సినిమా హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమా రేవు రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నిహారిక సైరాలో తన పాత్ర గురించి వివరించింది. “సైరా లాంటి స్పెషల్ మూవీలో నటించేందుకు ఆల్ మోస్ట్ రామ్ చరణ్ అన్న కాళ్లు పట్టుకున్నాను. ప్లీజ్ డాడీ (చిరంజీవి) తో ఒక్క ఫ్రేమ్ లో అయినా కనిపించాలని రిక్వెస్ట్ చేశా. ఎందుకంటే ఈ సినిమా అలాంటిది. వెరీ వెరీ స్పెషల్. క్యారెక్టర్ లేకపోయినా ఫర్వాలేదు, డైలాగ్ లేకపోయినా ఫర్వాలేదు. డాడీ పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తే చాలని చరణ్ ను అడుక్కున్నాను. చాలా చిన్న రోల్ ఇచ్చారు. బోయ అమ్మాయిగా కనిపిస్తాను. రెండు సీన్స్ లో కనిపిస్తానేమో. 2 డైలాగ్స్ కూడా ఉన్నాయి. నాలాగే ఓ 300మంది బోయ అమ్మాయిలు కూడా ఉంటారు. అంత చిన్న పాత్ర నాది.” అని వివరించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus