మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరు చట్టపరంగా విడిపోబోతున్నారంటూ అధికారక ప్రకటన రావడంతో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య విడిపోయారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి మొట్టమొదటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మరి విడాకుల తర్వాత నిహారిక చేసిన మొదటి పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే… నిహారిక సోషల్ మీడియా వేదికగా తన బెస్ట్ ఫ్రెండ్ కి విషెస్ చెబుతూ చేసినటువంటి పోస్ట్ అందరిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక ఎన్ ఎం గురించి అందరికీ తెలిసిందే. ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా సందడి చేశారు. అలాగే పలు సినిమాలను కూడా ప్రమోట్ చేసారు. అయితే ఈ ఇద్దరి నిహారికల మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది.
ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెబుతూ (Niharika) నిహారిక మొదటి పోస్ట్ చేశారు. ఇలా ఒకవైపు విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈమె మాత్రం విడాకుల గురించి స్పందించకుండా తన ఫ్రెండ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేయడంతో అసలు నిహారిక విడాకుల వార్తల గురించి పెద్దగా పట్టించుకోలేదని తన విడాకులను చాలా లైట్ గా తీసుకున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!