నా డైరెక్టర్ ఓ రాక్షసుడు : నిఖిల్

ఓ సినిమా తెరకెక్కిస్తున్న టైంలో దర్శకుడికి.. నిర్మాతకి, లేదా నిర్మాతకి .. హీరోకి, లేదా దర్శకుడికి.. హీరోకి, ఇలా చాలా గొడవలు అవుతుంటాయి అంటూ గాసిప్స్ రావడం కామన్. అయితే ఈ విషయాన్ని వారు బహిరంగంగా చెబితేనే తప్ప.. ఈ విషయాల పై ఎటువంటి క్లారిటీ రాదు. అయితే ‘నేను డైరెక్టర్ తో గొడవ పడ్డాను’ అంటూ బహిరంగంగా చెబుతున్నాడు ఓ హీరో. విషయంలోకి వెళితే.. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’. నవంబర్ 29న(నిన్న) విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. దీంతో ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఓ ప్రమోషనల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ.. “నా దర్శకుడితో డిస్కర్షన్స్ టైంలో భాగంగా గొడవలు కూడా జరిగాయి. నేను మా డైరెక్టర్ చాలా సార్లు కొట్టుకున్నాం. అనుకున్న దానికంటే మా డైరెక్టర్ ఎక్కువ ఖర్చు పెట్టించాడు. ఇక ఒక్కో సందర్భంలో నాకు ఆయనలో రాక్షసుడు కనిపించాడు. ఫైనల్ గా బహిరంగంగా చెప్తున్నా సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం దర్శకుడికే చెల్లుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus