Mahesh Babu: మహేష్ బాబుపై సల్మాన్ ఖాన్ ఎలివేషన్స్.. ఇది చూశారా!

సూపర్ స్టార్ మహేష్ బాబుపై (Mahesh Babu)  బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ (Salman Khan)  చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హిందీ బిగ్ బాస్ సీజన్ 18లో, నటీమణి శిల్ప శిరోద్కర్ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. శిల్ప, నమ్రత శిరోద్కర్  (Namrata Shirodkar)  సోదరి కావడం వల్ల ఆమెకి మహేష్ బాబుతో ప్రత్యేకమైన కుటుంబ బంధం ఉంది. దీంతో మొదటి నుంచి కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో ఆమె పేరు ట్రెండింగ్ లో ఉంది.

Mahesh Babu

ఇటీవల బిగ్ బాస్ ఒక ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్, శిల్పతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, మహేష్ బాబు (Mahesh Babu) గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. “మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపించే స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ నిజంగా అదిరిపోయేలా ఉంటాయి. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఆయన సింపుల్‌గా, ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వ్యక్తి,” అంటూ సల్మాన్ ప్రశంసలు కురిపించారు. ఈ మాటలు విన్న శిల్ప కూడా ఆనందంతో గర్వంగా సల్మాన్ మాటలకు స్పందించింది.

శిల్ప పేరు ప్రస్తావనతో పాటు మహేష్ బాబు గురించి ఈ విధంగా మాట్లాడటంతో ఆ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రత్యేకించి మహేష్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబుని ఒక గొప్ప నటుడిగానే కాకుండా, వ్యక్తిత్వం పరంగా కూడా సల్మాన్ కితాబిచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నమ్రత కూడా తన సోదరి శిల్పకి బిగ్ బాస్ షోకి ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపింది.

ఈ పోస్ట్ మరింత వైరల్ అవ్వడంతో శిల్ప శిరోద్కర్ పేరు హిందీ ప్రేక్షకులలో కూడా బాగా గుర్తింపు పొందుతోంది. మొత్తానికి బిగ్ బాస్ వంటి షో ద్వారా మాత్రమే కాకుండా, సల్మాన్ ఖాన్ మాటల ద్వారా మహేష్ బాబు హిందీ బెల్ట్ ప్రేక్షకుల్లో మరోసారి తమ ప్రత్యేకతను రుజువు చేసుకున్నట్లు అనిపిస్తోంది.

చిక్కుల్లో పడ్డ ‘పీపుల్ మీడియా’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus