నిఖిల్.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’..!

  • May 23, 2016 / 08:00 AM IST

‘శంకరాభరణం’ పరాజయం తరువాత నిఖిల్ .. జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ మరో ముగ్గురు దర్శకులతో కలిసి పనిచేస్తున్నాడు. వారిలో ఆనంద్ విఐ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుండగా.. ఈ చిత్రం ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో నిఖిల్ సరసన అవికా గోర్, హెబా పటేల్, నందిత శ్వేతలు జంటగా నటిస్తుండగా.. ఈ చిత్రానికి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే టైటిల్ ఖరారు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మేఘన ఆర్ట్స్ పతాకం పై వెంకటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus