సాయిధరమ్‌తేజ్‌యాక్సిడెంట్ విషయంలో చాలామంది చాలారకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఎవరు కరెక్ట్, ఎవరు కాదు అనే విషయం మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో మనం మరో విషయం కూడా గమనించొచ్చు. అదే సాయిధరమ్‌తేజ్‌కు ఆసుపత్రిలో వైద్యం జరుగుతున్నప్పుడు తీసిన వీడియో. సాయి వైద్యానికి స్పందిస్తున్నాడు అంటూ ఆ వీడియోను షేర్ చేసిన వాళ్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారంపై యువ కథానాయకుడు నిఖిల్ స్పందించారు. సాయిధరమ్ తేజ్‌కు చికిత్స చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు బయటకు రావడం బాధాకరమని నిఖిల్ అన్నారు.
అసలు ఐసీయూలోకి మొబైల్ కెమెరాలను ఎందుకు అనుమతించారు అంటూ నిఖిల్ ప్రశ్నించారు. ఈమేరకు నిఖిల్ ఆగ్రహంతో ట్వీట్ చేశారు. ‘ఇక్కడ చూడండి.. కళ్లు తెరవండి’ అంటూ వైద్యుడు సాయితేజ్ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సాయితేజ్ ఆరోగ్యం గురించి ఆ వీడియో సమాచారం ఇచ్చేలా ఉన్నప్పటికీ… అలాంటి వీడియోలు బయటకు రావడం వాళ్ల ప్రైవసీని దెబ్బతీయడమే అనే వాదనా వినిపించింది.ఇప్పుడు నిఖిల్ కూడా అదే పాయింట్ లేవనెత్తాడు.
ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నప్పుడైనా ఓ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వండి అంటూ నిఖిల్ కోరాడు. ఆ వీడియో బయటకు ఎలా వచ్చిందో తెలియదు కానీ… ఇలాంటి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో ఆలోచించుకోవాలి సుమీ.
Why are Cameras being allowed into an ICU ? It’s sad to see these videos of @IamSaiDharamTej getting treated. Please Respect A persons Privacy🙏🏽 At least inside a Hospital ICU…