Nikhil: ఆ హీరోయిన్ పై నిఖిల్ ఫైర్.. కన్నీళ్లు ఆగవంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నిఖిల్ కార్తికేయ2 పాన్ ఇండియా హిట్ గా నిలిచిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిఖిల్ నటించిన 18 పేజెస్ మూవీ వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉండే నిఖిల్ తాజాగా ప్రముఖ నటి రిచా చద్దాపై ఫైర్ అయ్యారు. రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

“galwan says hi” అంటూ రిచా చద్దా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ పై నిఖిల్ ఫైర్ అయ్యారు. సైనిక దళాలను అవమానించే విధంగా పోస్ట్ లు పెట్టడం సరికాదని నిఖిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాల గురించి చదువుతుంటే తనకు ఇప్పటికీ కన్నీళ్లు ఆగవని నిఖిల్ చెప్పుకొచ్చారు. మన దేశ అర్మీని ఎప్పుడూ గౌరవించాలని అవమానించకూడదని నిఖిల్ కామెంట్లు చేయడం గమనార్హం. మన దేశ ఆర్మీని దయచేసి గౌరవించాలని దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోవాలని నిఖిల్ చెప్పుకొచ్చారు.

సినీ, రాజకీయ ప్రముఖులు రిచా చద్దా చేసిన ట్వీట్ విషయంలో మండిపడుతున్నారు. రిచా చద్దా సైతం తన ట్వీట్ విషయంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. వివాదాస్పద అంశాలకు సంబంధించి జోక్యం చేసుకోవడం కెరీర్ పై కూడా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. రిచా చద్దా సినీ కెరీర్ పై కూడా ఈ ట్వీట్ ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది.

రిచా చద్దా బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నటించారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని రిచా చద్దాకు ఆమె సన్నిహితులు సైతం సూచిస్తున్నారు. రిచా చద్దా ఇకనైనా ఈ తరహా ట్వీట్లకు దూరంగా ఉంటారేమో చూడాల్సి ఉంది. రిచా చద్దాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus