Swayambhu: నిఖిల్‌ ‘స్వయంభు’ గురించి హీరోయిన్‌ లీక్‌.. సాధ్యమేనా అంటూ..!

రీఎంట్రీలో ఫస్ట్‌ సినిమా అనో, లేక హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అనో తెలియదు కానీ ‘డార్లింగ్‌’ సినిమాకు నభా నటేశ్‌ తెగ ప్రచారం చేస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగా తన తర్వాతి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘స్వయంభు’ (Swayambhu)  సినిమా గురించి కూడా మాట్లాడుతోంది. నిఖిల్‌ (Nikhil Siddharth) హీరోగా రామ్‌చరణ్‌ (Ram Charan)  ఒక నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనే విషయం తెలిసిందే.

ఒక సినిమాను రెండు, మూడు పార్ట్‌ల్లో చెప్పడం అంటే ఒకప్పుడు అరుదు. అయితే పాన్‌ ఇండియా ఫీవర్‌ వచ్చాక ఎందుకో కానీ, చాలా సినిమాలు అలా వచ్చేస్తున్నాయి. ఆ అవసరం ఉందా? రెండు పార్టులు చేయాలా అనేది కూడా చూడటం లేదు అని సినిమా చూశాక అర్థమవుతోంది. మరి అవకాశం ఉందో లేదో తెలియదు కానీ.. ‘స్వయంభు’ కూడా ఒక పార్టుతో ముగిసేలా లేదట. ఈ మాటను ఆ సినిమా నాయిక నభానే చెప్పింది.

నిఖిల్- నభా నటేష్ (Nabha Natesh) నటిస్తున్న ఈ సినిమాను రెండు లేదా మూడు భాగాలుగా తీసుకురావొచ్చట. ఈ సినిమా రెండు, మూడు భాగాలుగా తీయొచ్చనే హింట్‌ చిత్ర దర్శకుడు ఇప్పటికే ఇచ్చారు అని నభా నటేశ్ అంటోంది. సినిమా కథ చెప్పినపుడే దర్శకుడు ఈ మాట అన్నారట. మూడు, నాలుగు భాగాలకు సరిపడా కథ తన దగ్గర ఉందని, రెండు భాగాలు అయితే తీయక తప్పదు అని చెప్పారట.

దీంతో పాన్‌ ఇండియా సినిమా అనుకున్నారు కానీ.. ఏకంగా సినిమాటిక్‌ యూనివర్స్‌నే సిద్ధం చేస్తున్నారు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2)  సినిమా తరువాత నిఖిల్ ‘స్పై’ (SPY) అని ఓ సినిమా చేశారు. అది కూడా పాన్‌ ఇండియా మూవీ అన్నారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. మరి ఈ సినిమా ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus