18 Pages Movie: నిఖిల్ సినిమాపై పాన్ ఇండియా బజ్!

ఈ మధ్యకాలంలో తెలుగులో విడుదలవుతున్న చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా నార్త్ లో సౌత్ సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ వస్తుంది. అక్కడ వస్తోన్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ2’ సినిమా తెలుగులో చిన్న సినిమాగా రిలీజయింది. దీన్ని నార్త్ లో కూడా రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

దీంతో ఈజీగా రూ.100 కోట్ల మార్క్ ను దాటేసింది. నిఖిల్ కి అక్కడ మంచి ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా క్రియేట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఈ సినిమాను చూపిస్తూ.. ’18 పేజెస్’ సినిమాను అమ్మే పనిలో పడింది గీతాఆర్ట్స్. సుకుమార్ కథతో సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే. రీసెంట్ గా సినిమాలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీ రెడీ చేయాలని చూస్తున్నారు. ‘కార్తికేయ2’ సక్సెస్ ’18 పేజెస్’కి డిమాండ్ తీసుకొచ్చింది. ‘కార్తికేయ2’లో నటించిన అనుపమనే ఇందులో కూడా హీరోయిన్ గా నటిస్తుండడంతో బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు. తెలుగు, హిందీ శాటిలైట్ రైట్స్ అమ్ముడైపోయాయి. వీటిని జీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక మిగిలింది థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. కొన్ని ఏరియాల్లో గీతాఆర్ట్స్ సంస్థే సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతుంది. మొత్తానికి ‘కార్తికేయ2’ సక్సెస్ ’18 పేజెస్’కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా కూడా హిట్ అయితే నిఖిల్ రేంజ్ మరింత పెరిగిపోతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus