Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » కొత్తవాళ్లందరూ కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా “నిలవే”

కొత్తవాళ్లందరూ కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా “నిలవే”

  • May 26, 2025 / 01:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్తవాళ్లందరూ కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా “నిలవే”

సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించిన ‘నిలవే’ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి పాత్రల్ని పరిచయం చేశారు. సంతోషం, నమ్మకం, అలక, పిలుపు అంటూ అన్ని రకాల ఎమోషన్స్‌కు సంబంధించిన ‘నిలవే’ పోస్టర్‌లను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

హీరో సౌమిత్ రావు మాట్లాడుతూ .. ‘‘నిలవే’ ఓ మంచి మ్యూజికల్ లవ్ డ్రామాగా రాబోతోంది. అంతా కొత్త వాళ్లం కలిసి చేస్తున్నాం. కొత్త వాళ్లు కూడా మంచి చిత్రాలను తీస్తారు. మేం ఎంతో నిజాయితీతో ఈ మూవీని చేశాం. మా కంటెంట్ బాగుందని ఆడియెన్స్ చెప్పాలి. మా సినిమా బాగుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మా మూవీని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలి. నిజాయితీకి అర్థం ఉంటే అది మా ‘నిలవే’ సినిమా. మా చిత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.

దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ .. ‘మా పేర్లు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. మాది చిన్న టీం కావొచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ‘నిలవే’. మ్యూజిక్‌ని లవ్‌తో చూపించాలని అనుకున్నాం. మేం కథ పైన ప్రేమతో ఎంతో కష్టపడి ‘నిలవే’ చిత్రాన్ని తీశాం. టీజర్ చూస్తే నిజాయతీగా ఉంటుంది. ఎక్స్‌పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలా మంది చెప్పారు. కానీ మా కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం. ‘నిలవే’ చాలా మంచి సినిమా. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ .. ‘‘నిలవే’ టైంకి నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ నా మీద నమ్మకంతో సినిమాను ఇచ్చారు. ఈ మూవీకి కొత్త మ్యూజిక్‌ను ఇచ్చాం. సినిమా, కథ నుంచే ఇంత మంచి సంగీతం వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ మూవీని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మంచి చిత్రానికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కెమెరామెన్ దిలీప్ కే కుమార్ మాట్లాడుతూ .. ‘‘నిలవే’ లాంటి మంచి చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. ‘నిలవే’ మ్యూజిక్ విన్న తరువాత దానికి తగ్గ విజువల్స్ ఇవ్వడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. మా సినిమాకు అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

లిరిక్ రైటర్ ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘సౌమిత్ రావు, నేను కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తిరిగాం. అప్పటి నుంచి ఈ కాన్సెస్ట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇందులో పెద్ద బడ్జెట్, క్యాస్టింగ్ లేకపోవచ్చు.. కానీ పెద్ద డ్రీమ్, మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చాలా మంచి చిత్రం అవుతుంది. సినిమా చూశాక నచ్చితేనే అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

లిరిక్ రైటర్ కోటి మాట్లాడుతూ .. ‘‘నిలవే’ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. కళ్యాణ్ అన్న మంచి సంగీతాన్ని అందించారు. ఇందులో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు సౌమిత్ అన్నకి, సాయి అన్నకి థాంక్స్. ఈ చిత్రం అందరినీ కచ్చితంగా కదిలిస్తుంది. అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత మరియు ఇతరులు.

టెక్నికల్ టీమ్ :
బ్యానర్ – POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్
నిర్మాతలు: సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాడి
దర్శకత్వం – సౌమిత్ రావు, సాయి వెన్నం
సహ-నిర్మాతలు: వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ, తాహెర్ సినీ టెక్
సంగీతం: కళ్లాన్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
అడిషనల్ సినిమాటోగ్రఫీ – జగదీష్ వర్మ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అన్వేష్ పెరటి, అజయ్ కుమార్ పుప్పల
లైన్ ప్రొడ్యూసర్లు: సునందా ఐథాని, సుష్రిత్ దేవి
పాటలు: ఎమ్‌వి.ఎస్. భారద్వాజ్
అడిషనల్ లిరిక్స్ – కోటి
ప్రొడక్ష్ డిజైనర్స్- కట్టి శివరామ కృష్ణ, జియా ఘోష్
అడిషనల్ ప్రొడక్షన్ డిజైనర్ – నూరా సయ్యద్
ఎడిటర్: సత్య.జి
మేకప్ అండ్ హెయిర్ – రవడ శీను, నవీన్ చౌదరి
పి ఆర్ ఓ: బియాండ్ మీడియా(నాయుడు సురేంద్ర కుమార్- ఫ‌ణి కందుకూరి)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nilave

Also Read

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

related news

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

trending news

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

5 hours ago
Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

5 hours ago
Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

8 hours ago
Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

9 hours ago
Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

10 hours ago

latest news

దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

9 hours ago
తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

9 hours ago
ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

10 hours ago
‘షష్టిపూర్తి’ ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది.. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఉంటుంది- నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

‘షష్టిపూర్తి’ ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది.. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఉంటుంది- నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

11 hours ago
Housefull 5: ఇదేం విడ్డూరం సామీ.. ఒక్కో థియేటర్‌లో ఒక్కో క్లైమాక్సా? ఎందుకిలా చేశారో?

Housefull 5: ఇదేం విడ్డూరం సామీ.. ఒక్కో థియేటర్‌లో ఒక్కో క్లైమాక్సా? ఎందుకిలా చేశారో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version