బ్రేక్ ఇచ్చిన పెద్ద సినిమాలు.. క్యూ కట్టిన బడ్జెట్ సినిమాలు!

  • June 16, 2022 / 11:20 AM IST

నిర్మాతలకు తమ సినిమాల మీద ఎంత నమ్మకం ఉన్నా తప్పు లేదు కానీ పోటీ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అసలే బాక్సాఫీస్ వద్ద పరిస్థితి మారిపోయాయి. చిన్న సినిమాలు వస్తున్నాయంటే.. జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓటీటీలో చూసుకోవచ్చనే ధోరణిలో ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో చూసిన తరువాత చిన్న సినిమాలను లైట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ చిన్న సినిమాల నిర్మాతలు తగ్గడం లేదు.

వచ్చే వారం ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. జూన్ 24న ఎనిమిది సినిమాలు, దానికంటే ఒకరోజు వర్మ ‘కొండా’ సినిమా రాబోతుంది. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే.. ఓపెనింగ్స్ ను పంచుకోవాల్సి ఉంటుంది. దీని వలన నిర్మాతలకు కలిసొచ్చేదేమీ లేదు. ముందుగా కిరణ్ అబ్బవరం నటించిన ‘సమ్మతమే’ సినిమాను జూన్ 24న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాపై యూత్ కి ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. అదే డేట్ ను ఆకాష్ పూరి ‘చోర్ బజార్’ రాబోతుందని సడెన్ గా అనౌన్స్ చేశారు.

ప్రమోషన్స్ విషయంలో కూడా జోరు పెంచారు. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన ‘7 డేస్ 6 నైట్స్’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది. సాయిరాం శంకర్ హీరోగా రూపొందిన ‘ఒక పథకం ప్రకారం’ సినిమా కూడా సడెన్ గా జూన్ 24న రిలీజ్ కానుందని సడెన్ గా అనౌన్స్ చేశారు. వీటితో పాటు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘షికారు’, ‘సదా నన్ను నడిపే’ సినిమాను ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటికంటే ఒకరోజు ముందు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ రిలీజ్ కాబోతుంది. వీటిలో ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తుందేమో చూడాలి!

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus