రాజకీయ నాయకులు, మంత్రులు అందులోనూ సెంట్రల్ మినిస్టర్స్ ఎంత బిజీ బిజీగా ఉంటారో చెప్పక్కర్లేదు.. అలాంటిది ఓ సినిమా చూడ్డానికి సమయాన్ని కేటాయించడం.. సపరేట్‌గా స్క్రీన్ బుక్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు.. ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది కదా మరి.. అవును.. గత కొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనే కోరికను కలిగించిన చిత్రం ‘కాంతార’.. ఇప్పటికే సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ‘కాంతార’ పై, రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపించారు..
పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కూడా ఈ మూవీ చూశారు. యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రతిభని కొనియాడారామె..బెంగుళూరులో, తన మిత్రులు, వాలంటీర్ల టీమ్‌తో కలిసి కేంద్రమంత్రి ‘కాంతార’ చిత్రాన్ని వీక్షించారు.. తన ఫ్రెండ్స్, వాలంటీర్లతో కలసి ‘కాంతార’ చూశానని.. రిషబ్ శెట్టి అద్భుతంగా నటించడమే కాక దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారని.. కర్ణాటక సంసృతి, సాంప్రదాయాలను ఆకట్టుకునేలా తెరకెక్కించారని నిర్మల, రిషబ్ శెట్టిని ప్రశంసించారు..
ఈ మేరకు సినిమా చూస్తున్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారామె..‘కాంతార’ మరో అరుదైన ఘనత సాధించింది.. 300 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది.. 305 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ప్రకటించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘కాంతార’ తెలుగు వెర్షన్ అక్షరాలా 50 కోట్ల రూపాయల వసూళ్లతో.. రేర్ ఫీట్ సాధించింది.. హిందీలో ‘కార్తికేయ 2’ షాకింగ్ కలెక్షన్స్ రాబట్టి ఆశ్చర్యపరిస్తే.. అతి తక్కువ టైంలోనే ఆ రికార్డుని బీట్ చేసేసింది ‘కాంతార’..
నవంబర్ 1 నాటికి ‘కాంతార’ హిందీ వెర్షన్ 47.55 కోట్లు వసూలు చేసింది.. ఈ మూడో వారంలోనే అక్కడ కూడా 50 కోట్ల మార్క్‌ని టచ్ చెయ్యడానికి రెడీ అయిపోతుంది.. ప్రతీ వారం కొత్త సినిమాలొచ్చి వెళ్లిపోతున్నాయి కానీ ‘కాంతార’ మాత్రం రిపీట్ ఆడియన్స్, మ్యాజిక్ నంబర్స్‌తో బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తూనే ఉంది..
With a team of volunteers and well-wishers watched #KantaraMovie in Bengaluru.
Well made @shetty_rishab (writer/director/actor).
The film captures the rich traditions of Tuluvanadu and Karavali.
Finance Minister Nirmala Sitharaman @nsitharaman watched KANTARA Kannada Movie at Bengaluru. Nirmala Sitharaman ji congratulated @shetty_rishab over phone and appreciated the movie. pic.twitter.com/FkrhVWwq9t