మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) .. ప్రస్తుతం మాస్, ఫన్ డ్రామా మిక్స్ తో తెరకెక్కుతున్న ‘మెగా 157’ (Mega 157) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తుండగా, నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసిన ఈ చిత్రానికి తాజాగా ఓ పెద్ద టెక్నీషియన్ జాయిన్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా ద్వారా తన స్టంట్స్‌తో ఆకట్టుకున్న యాక్షన్ డైరెక్టర్ నబా కాంత మెతీ, ఇప్పుడు మెగాస్టార్ చిత్రానికి పని చేయనున్నట్లు సమాచారం.
‘పుష్ప 2’ క్లైమాక్స్, జాతర సీన్‌లకు ఆయనే వెనుక ఉన్న టెక్నికల్ బ్రెయిన్. చిరుతో ‘ఆచార్య’ (Acharya), ‘వాల్తేరు వీరయ్య’లో (Waltair Veerayya) కూడా పనిచేసిన నబా, ఈసారి అనిల్ రావిపూడితో కలిసి మరింత హై స్టేండర్డ్ యాక్షన్‌ను డిజైన్ చేయబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ ఓపెనింగ్ బ్లాక్ కోసం ప్రత్యేకమైన స్టంట్స్ ప్లాన్ చేసిన నబా, సాలీడ్ విజువల్స్‌ను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారట.
ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సాహు గారపాటి (Sahu Garapati) ‘షైన్ స్క్రీన్స్’ పై నిర్మిస్తుండగా, చిరంజీవి కుమార్తె సుస్మిత (Sushmita Konidela) ‘గోల్డ్ బాక్స్’ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న ప్లాన్‌తో నిర్మిస్తున్నారు. నయనతార, చిరంజీవి కాంబినేషన్‌తో పాటు.. నబా డిజైన్ చేసే యాక్షన్ పార్ట్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుందనడంలో సందేహం లేదు.