నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘లై’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. రెండో చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ తో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘పేట’ ‘రాజ రాజ చోర’ ‘డియర్ మేఘ’ ‘గుర్తుందా శీతాకాలం’ ‘ప్రేమ దేశం’ ‘రావణాసుర’ వంటి చిత్రాల్లో నటించింది. ఇలా మొత్తం 7 సినిమాల్లో ఈమె నటిస్తే.. ఒక్క ‘రాజ రాజ చోర’ చిత్రం మాత్రమే విజయం సాధించింది.
అది కూడా హీరో మార్కెట్ రేంజ్ కు తగ్గ హిట్ అనుకోవాలి. ఇక మిగిలిన అన్ని సినిమాలు ఎలాగూ ప్లాపులే..! ఒక్క భారీ హిట్టు కూడా లేకపోయినా ఇన్ని క్రేజీ సినిమాల్లో ఛాన్సులు కొట్టింది అంటే మామూలు విషయం కాదు. కోలీవుడ్లో కూడా ఈ అమ్మడు క్రేజీ ఆఫర్లు పడుతుంది. ఇటీవల వచ్చిన ‘రావణాసుర’ సినిమాలో ఈమె హారిక అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ లాగా కనిపించినా హీరోయిన్ కాదు.
హీరో (Nithiin) చేతిలో రేప్ అండ్ మర్డర్ కు గురవుతుంది. సినిమాలో ఓ పెద్ద ట్విస్ట్ కు ఈమె పాత్ర ఉపయోగపడింది. కానీ తర్వాత ఈమెది నెగిటివ్ రోల్ అని చెప్పి గాలి తీసేశారు. ఈమె ఆ పాత్రలో బాగా నటించింది. ఈమె నటించిన సినిమాలన్నిటిలో చెప్పుకోదగ్గ నటన కనపరిచింది ఈ సినిమాలోనే అని చెప్పాలి.
‘రావణాసుర’ కనుక హిట్ అయ్యుంటే తప్పకుండా ఈమెకు మంచి ఛాన్స్ లు వచ్చేవి. కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ప్రస్తుతం మేఘా ఆకాష్ రెండు చిన్న సినిమాల్లో నటిస్తోంది. వాటితో అయినా ఆమె హిట్లు కొడుతుందేమో చూడాలి..!
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!