అయ్యో .. నితిన్ ప్లాన్స్ అన్నీ అప్సెట్ అయ్యాయే…!

  • May 2, 2020 / 08:26 PM IST

‘అ ఆ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి మూడు డిజాస్టర్ లను మూటకట్టుకుని రేసులో వెనుక పడ్డాడు నితిన్. గతేడాది ఒక్క చిత్రం కూడా విడుదల చెయ్యని నితిన్ ఈ ఏడాది ఫిబ్రవరి లో వచ్చిన ‘భీష్మ’ తో హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అన్ సీజన్ అయినప్పటికీ 28 కోట్ల షేర్ ను రాబట్టింది. థియేటర్లు మూత పడకుండా ఉండి ఉంటే 30 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి ఉండేది అనడంలో సందేహం లేదు.

అనంతరం ఏప్రిల్ నెలలో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఎన్నారై షాలిని రెడ్డి తో నితిన్ పెళ్ళైన సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ లో పరిస్ధితి బాలేదు కాబట్టి హైదరాబాద్ లోనే పెళ్ళి జరపాలి అని భావించారు. అయితే ఇక్కడ కూడా లాక్ డౌన్ వల్ల పెళ్ళిళ్ళు అతి తక్కువ మందితో జరుపుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఇంత సింపుల్ గా పెళ్ళి జరుపుకోవడం అవసరమా అని నితిన్, షాలిని తమ పెళ్ళిని వాయిదా వేసుకున్నారు.

ఇక ఈ ఏడాది మరో 3 సినిమాలను కూడా నితిన్ ఫినిష్ చెయ్యాలి అని భావించాడు. ‘రంగ్ దే’, ‘అంధాదున్’ రీమేక్ , ‘చెక్’, ‘పవర్ పేట’ … వంటి చిత్రాలు ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదు. ముందుగా ‘రంగ్ దే’ అయితే విడుదల అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమైనా నితిన్.. ఈ ఏడాది ఒకటి అనుకుంటే… మరొకటి అయ్యింది అనే చెప్పాలి.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus