టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి హీరో నితిన్ ఇటీవల ఎక్స్ట్రా ఆడినరీ మ్యాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు స్వయంగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. నితిన్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
నితిన్ ఇటీవల నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ప్రేక్షకులను తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేస్తున్నాయి. రష్మిక నితిన్ హీరో హీరోయిన్లుగా నటించిన భీష్మ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయనకు సరైన సక్సెస్ రాలేదని చెప్పాలి. ఇక ఇటీవల ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కూడా తీవ్ర నిరాశపరిచింది. ఇలా వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో ఈయన సాలిడ్ గానే అందుకుంటున్నారని చెప్పాలి.
నితిన్ (Nithiin) ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అయితే ఈయన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్న కూడా రెమ్యూనరేషన్ లో మాత్రం తగ్గేది లేదు అంటూ ఏమాత్రం తగ్గించుకోకుండా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక నితిన్ మరో రెండు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ రెండు సినిమాలు కనుక సక్సెస్ కాకపోతే ఈయన కెరియర్ పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా సందడి చేస్తాయో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులను జరుపకుంటున్నాయి.