రాంచరణ్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ టైములో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం కథ కొత్తదేమీ కాదు. మనం ఎప్పుడో చూసిన సినిమాలని పోలి ఉంటుంది. అయితే సుకుమార్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం అందరినీ మెప్పించింది. ఇప్పుడు దాదాపు ఇలాంటి కథతోనే మరో చిత్రం తెరకెక్కుతుంది. అదే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’.
నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎడిటర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతనికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. ఓ గ్రామం. అక్కడ జనాలని పీడించుకునితినే తహసీల్దార్. ప్రతీసారి అతను ఏకగ్రీవంగానే ఎన్నికవ్వడం.అతనికి పోటీగా నామినేషన్ వేసినవాళ్ళని క్రూరంగా చంపించేయడం.’రంగస్థలం’ కథ కూడా దాదాపు ఇలానే ఉన్నా.. తర్వాత అది పరువు హత్యలు, రివేంజ్ డ్రామాగా మారిపోతుంది. అయితే ‘మాచర్ల’ కి వచ్చేసరికి కలెక్టర్ ఆ తహసీల్దార్ కు ఎలా బుద్దిచెప్పాడు అనేది అసలైన కథగా మారబోతుంది.
ఈ చిత్రంలో విలన్ కు హీరోకి మధ్య వచ్చే సన్నివేశాల్లో మంచి మాస్ అప్పీల్ ఉంటుందట. స్క్రీన్ ప్లే కూడా దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా జాగ్రత్తపడుతున్నట్టు వినికిడి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంతెర్తైనెర్లతోనే హిట్లు కొట్టే నితిన్ కు ఈ మాస్ కథ ఎంత వరకు కలిసొస్తుందో చూద్దాం.