Nithiin: నితిన్‌ ఆలోచన భలే ఉంది.. మిగిలినవాళ్లు ఫాలో అవుతారా!

ఒక సినిమా పూర్తయ్యాక ఆ టీమ్‌తో మరో సినిమా చేయడం గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా మంది హీరోలు ఇలాంటి పనులు చేశారు. దర్శకుడు, నటులు మారినా ఆ సినిమా టీమ్‌తో సినిమా చేస్తుంటారు. అయితే ఓ సినిమా షూటింగ్‌ కోసం వెళ్లిన టీమ్‌తో మరో సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చేసుకోవడం గురించి తెలుసా? యువ హీరో నితిన్ ఇప్పుడు అదే పని చేశారని టాక్‌. టాలీవుడ్‌ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమైందంటే…

నితిన్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఒకటి అయితే, రెండోది వక్కంతం వంశీ సినిమా. ఈ రెండూ పారలల్‌గానే షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇటీవల ‘మాచర్ల..’ సినిమా కోసం నితిన్‌ ఇటలీ వెళ్లాడు. అక్కడ మూడు పాటలు షూటింగ్‌ చేయాలనేది టీమ్‌ ఆలోచనట. అయితే మధ్యలో కాస్త గ్యాప్‌ వచ్చిందట. దీంతో ఆ గ్యాప్‌ టైమ్‌ను వక్కంతం వంశీ సినిమాకు ఇచ్చేశాడట నితిన్‌. ఆ గ్యాప్‌తో వంశీ సినిమా కోసం పాట షూట్‌ చేశారట.

అంత ఈజీగా ఇక్కడి నుండి టీమ్‌ను తీసుకెళ్లి షూట్‌ అవ్వదు అనే విషయం మీకు తెలిసిందే. అందుకే ‘మాచర్ల నియోజకవర్గం’ టీమ్‌నే వాడేసి వంశీ సినిమా కోసం ఓ పాట షూట్‌ చేశారట. ఇప్పుడు ఈ విషయం వైరల్‌గా మారింది. దీనిపై టీమ్‌ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ.. ఈ రేర్‌ ఫీట్‌ అయితే కచ్చితంగా జరిగింది అంటున్నారు. దీని వెనుక మరో కారణం కూడా ఉంది.

అదే ఈ రెండు సినిమాలకు ఒకరే ప్రొడ్యూసర్‌. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకం మీదే ఈ రెండూ రూపొందుతున్నాయి. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ నితిన్‌దే అనే విషయం తెలిసిందే. హీరోయిన్‌ శ్రీ‌లీల‌, డైరక్టర్‌ వ‌క్కంతం వంశీ, డాన్స్ మాస్ట‌ర్‌, కెమెరామెన్‌ను ఇండియా నుండి ఇటలీ రప్పించుకుని.. ‘మాచర్య నియోజకవర్గం’ టీమ్‌తో కలిసి పాట షూట్‌ చేశారట. అలా.. ఒకే యూనిట్‌తో రెండు సినిమాల‌కు సంబంధించిన షూటింగ్‌ చేశాడట నితిన్‌. మరి ఈ కాన్సెప్ట్‌ను మిగిలిన హీరోలు కూడా ఫాలో అవుతారా… చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus