శ్రీను వైట్ల ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ దర్శకుడు. ‘ఆనందం’ ‘వెంకీ’ ‘ఢీ’ ‘రెడీ’ ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. ‘దుబాయ్ శీను’ ‘కింగ్’ ‘బాద్ షా’ వంటి కమర్షియల్ సక్సెస్..లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ‘సొంతం’ వంటి అండర్ రేటెడ్ సినిమాలు కూడా లేకపోలేదు. అయితే ‘ఆగడు’ నుండి శ్రీను వైట్ల డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.
శ్రీను వైట్ల పనితనంపై అనుమానాలు రేకెత్తించాయి. అందువల్ల దాదాపు 6 ఏళ్ళు గ్యాప్ కూడా వచ్చింది. మొత్తానికి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో ‘విశ్వం’ అనే సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు శ్రీను వైట్ల. కానీ అది యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఒక రకంగా శ్రీను వైట్లలో ఎంతో కొంత మేటర్ అయితే ఉంది అని ఆ సినిమా ప్రూవ్ చేసినట్టు అయ్యింది.
అందువల్ల ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ముందుకొచ్చి శ్రీను వైట్లతో సినిమా చేయడానికి రెడీ అయ్యింది. అయితే శ్రీను వైట్ల సినిమాల్లో రైటింగ్ లోపాలు ఎక్కువగా కనిపించాయి. అందుకే అతనికి భాను,నందు అనే ఇద్దరు టాలెంటెడ్ రైటర్స్ ను అప్పగించింది ‘మైత్రి’ సంస్థ. వాళ్ళ సాయంతో శ్రీను వైట్ల స్క్రిప్ట్ బాగా రెడీ చేసుకున్నాడని అంటున్నారు. ‘మైత్రి’ వారి వద్ద నితిన్ డేట్లు ఉన్నాయి. దీంతో శ్రీను వైట్ల నితిన్ ను అప్రోచ్ అయ్యి కథ వినిపించాడట. ‘రాబిన్ హుడ్’ ‘తమ్ముడు’ డిజాస్టర్స్ తో డీలా పడ్డ నితిన్… మరోవైపు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ లో ఉన్నాడో లేడో తెలియని అయోమయంలో ఉన్నాడు. ఇలాంటి టైంలో శ్రీను వైట్లతో సినిమా చేయడానికి నితిన్ రెడీ అయితే.. ఇంకా పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని చెప్పాలి.